ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటను శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
అక్టోబర్‌ 11


రాష్ట్ర పురపాలకశాఖమంత్రి శ్రీ బొత్స సత్యన్నారాయణ ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌ 
–ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటను శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది.
–దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షటిడిపి లేనిపోని విమర్శలు చేస్తోంది.
–చంద్రబాబు మీ ఆలోచనాసరళి బాగోలేదు.
–విధానాల్లో లోపాలు ఉంటే సలహాలు ఇవ్వాలి.కాని ప్రతిదానిని విమర్శించడం లేదంటే పధకాలను ఆయనే ప్రవేశపెట్టాడని చెప్పడం బాగోలేదు.
–కంటివెలుగు,ఆరోగ్యశ్రీ,గ్రామసచివాలయాలు నేనే తెచ్చానని చంద్రబాబు చెబుతున్నారు.
–చంద్రబాబు కంటిచూపు మందగించింది.
–ఖబడ్దార్‌ మీకు 14 ఏళ్ల జైలు శిక్ష అని అధికారులను బెదిరిస్తున్నారు.ఎవర్ని బెదిరిస్తారు.
–మా ఎంఎల్‌ ఏపై ఆరోపణలు వస్తే ప్రభుత్వం ఉపేక్షించలేదు.ఆయనను సైతం పోలీసు స్టేషన్‌ లో కూర్చోబెట్టారు.
మీ హయాంలోలా డిజిపి వెంటనే మాట్లాడలేదు.
–మీ హయాంలో ఎవర్నైనా అలా చేయగలిగారా?చింతమనేని ప్రభాకర్‌ పై ఎన్ని ఆరోపణలు వచ్చినా అలా చేశారా?
–కాల్‌ మనీ ఆరోపణలు వస్తే ఆరోపణలు వచ్చిన మీ టిడిపినేతలపై కేసులు పెట్టగలిగారా?ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు.
–సాక్షాత్తు ఐపిఎస్‌ అధికారిపైనే దౌర్జన్యానికి దిగారు.
–నిన్న విశాఖలో మీటింగ్‌ పెట్టుకున్నారంట ఓ ఐదునిముషాలు పవర్‌ ఆగిందంట...దానికి సైతం చంద్రబాబు నాటకాలు ఆడారు.
–చంద్రబాబు మీ భాష ఏంటి?వైయస్‌ రాజశేఖరరెడ్డిగారు భయపడ్డారంట.ఏం మాటలు మాట్లాడుతున్నారండి 
–మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు.
–అప్పుకోసం ఎస్‌ బి ఐ దగ్గరకు వెళ్తే అప్పుతీర్చగలరా అని అడిగారంట అది నీ నిర్వాహకమే.
–నీవు చేసిన అడ్డగోలుకార్యక్రమాలను నియమనిభందనలు లేకుండా చేసిన వ్యవహారాలను మేం భరించాల్సివస్తోంది.
–గత ఐదేళ్లలో జరిగిన అస్తవ్యస్ద పాలన,దోపిడీని సక్రమంగా పెట్టడానికే మాకు టైం సరిపోతుంది.
–రాష్ట్రవిభజన వల్ల జరిగిన అన్యాయం, నష్టం కంటే మీ దోపిడీవల్లనే రాష్ట్రానికి ఎక్కువనష్టం జరిగింది.
–ఖజానాను దోపిడీచేసి దివాళా తీయించింది మీరు కాదా?
ఎఫ్‌ ఆర్‌ బిఎమ్‌ ను మెయింటెన్‌ చేయకపోతే,క్రమశిక్షణా లోపంతో పరిపాలన చేసినా వాటిని మేం సరిచేస్తున్నాం.
–గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఐదువేల కోట్ల రూపాయల చెల్లింపుల బకాయిలుంటే గొప్ప.నేడు అది ఏభైవేలకోట్ల రూపాయలు చేశారు.
విశాఖబ్రాండ్‌ ను చెడగొట్టారా?ఎవరు బ్రాండ్‌ ను చెడగొట్టింది.మీరు మీ మంత్రులు కాదా?మీ కుమారుడు మీ తాబేదార్లు బ్రాండ్‌ ను చెడగొట్టింది కాక మొసలి కన్నీరు కారుస్తున్నారు.
–హుద్‌ హుద్‌ విశాఖలో వస్తే ఆనందపురంలో రికార్టులను మార్చేశారు.
–హుద్‌ హుద్‌ తుపాను వస్తే దానిని సైతం భూరికార్డులను టాంపరింగ్‌ చేసేందుకు ఉపయోగించుకున్నారు.
–గ్రామసచివాలయానికి వైసిపి రంగు వేశారంట.మరి మీ పాలనలో అన్నింటికి పసుపు రంగేశారే మీరు ఎలా వేశారు.
–ఈ ప్రభుత్వం తాలూకా ముద్రని అక్కడ చూపుతున్నాం.
–ఏవైతే నవరత్నాలు ఉన్నాయో అవి అమలు కాకూడదు.అవి నవగ్రహాలుగా అయిపోవాలని శాపనార్దాలు పెడుతున్నారు.
నీవు ఎన్ని శాపనార్దాలు పెట్టినా మా అజెండా రాష్ట్ర అభివృధ్ది
–సామాజికవర్గం కోసమో ఓ స్నేహితుడికోసమో,ఓ చుట్టం కోసమో ఈ ప్రభుత్వం లేదు.ఐదుకోట్ల మంది అభివృధ్దికోసం మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు.
–వెల్త్‌ క్రియేట్‌ చేశావా?రాష్ట్రాన్ని నాశనం చేశావు.రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృధ్ది చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం.
–రైతుల దగ్గర భూసేకరణ చేశారు.వారికి తిరిగి లేఅవుట్లు ఇవ్వాలి.40 వేలమందికి రిజిస్ట్రేషన్స్‌ చేస్తున్నాం.సేకరించిన భూమి 33 వేల ఎకరాలైతే ,30 వేల కోట్ల రూపాయలు లేఅవుట్లకు మౌళికసదుపాయాలకు ఇవ్వాల్సి వస్తోంది.ఈ ధనం అంతా ప్రజలనుంచి టాక్స్‌ ల రూపంలో వచ్చిందికాదా?
–మీ ఆలోచన ఏంటి? మీ బాధ ఏంటి?ఎస్‌ బి ఐ నిన్న అదే అడిగింది మీ ప్రభుత్వం ఈ ఎం ఐలు కట్టలేకపోతున్నారు. ఈ సారి మీరు సరిగ్గా చెల్లించగలరా యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి మీ వి«ధానం ఏంటి అని అడిగింది.
–ఇవన్నీ ఇలా ఉంటే యనమల గారు మాట్లాడుతున్నారు.తలసరి ఆదాయం తగ్గింది స్టేట్‌ జిడిపి తగ్గింది అని అంటున్నారు.
ఈరోజు జిడిపి తగ్గిందన్నా ఫర్‌ క్యాపిటా తగ్గిందన్నా క్యాలిక్యులేషన్‌ ఎలా చేస్తారు.
–అది గత సంవత్సరం స్టాటిస్టిక్స్‌ ను బట్టి చేస్తారు.అంటే మీ పరిపాలనా విధానం వల్ల ఈ పరిస్దితి వచ్చిందనేది వాస్తవం కాదా?
–జిడిపి ప్యారమీటర్స్‌ ఏంటి ఇండస్ట్రీ,సర్వీసు సెక్టార్‌ ,వ్యవసాయం, ఇవన్నీ పెరగాలి.మాది దొంగలెక్కలు కాదు వాస్తవాలు కావాలి అంటే ఇవి వస్తాయి.
–నిన్న ప్రధాని దగ్గరకు వెళ్లి ఎందుకు ముఖం చాటేయ్యాలి అని అడుగుతున్నారు.చంద్రబాబుగారిలాగా గంటలు గంటలు వీడియోకాన్ఫరెన్స్‌ లు పెట్టుకుని అబద్దాలు చెప్పేపరిస్దితి జగన్‌ గారిలో లేదు.ఆయన పరిపాలన విధానం అది.లోపల ఒకటి మాట్లాడి బయటమరోటి చెప్పే మీలాగా చేసే పరిస్దితి శ్రీ వైయస్‌ జగన్‌ గారికి లేదు.మీలా ఉన్నవిలేనివి చెప్పరు.మీకు వచ్చిన నొప్పి ఏంటి రామకృష్ణుడుగారు.
–అస్తవ్యస్దం చేసి తిరోగమనంవైపు నెట్టారు.లోటుబడ్జెట్‌ ఓవర్‌ డ్రాఫ్ట్‌ లో ఉంటూ రాష్ట్రాన్ని అప్పచెప్పారు.దానిని శ్రీ వైయస్‌ జగన్‌ గారు స్ట్రీమ్‌ లైన్‌ చేయబోతుంటే ఊరకనే మాట్లాడుతున్నారు.
–మీలాగా వేలకోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటి చేసుకుంటే బాగుంటుందా? మీరు ఎన్ని మాట్లాడినా మా వి«ధానం మాదే.మేం ప్రజలకు ఏం ఇచ్చామో ఏం చెప్పామో అవి నెరవేర్చుకుంటాం తప్ప మీ అవాకులు చెవాకులకు మా విధానాలు మార్చుకునే పరిస్దితి మాత్రం మేం చేయం.
–నిన్న,మొన్న చూస్తే చంద్రబాబులో అసహనం పెరిగిపోయింది.నిరాశానిసృహలు కనిపిస్తున్నాయి.నాకు వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకున్నాననే భావన చంద్రబాబులో కనిపించడం లేదు.ఏదో నేను గొప్పగా చేశాను అని ఫీలవుతున్నమాటలు కనిపిస్తున్నాయి.
వయస్సు మీరిపోతుంది కాబట్టి డాక్టర్లు కేర్‌ తీసుకోవాల్సిన అవసరం వారి కుటుంబసభ్యులకు ఉంది.ఇటీవల మాటలు చూస్తే విడ్డురంగా ఉన్నాయి.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ 
జే టాక్స్‌ వేస్తున్నారంటున్నారనే ప్రశ్నకు చెబుతూ 
ఇప్పుడు ఎక్కడైనా ఎంఆర్‌ పి కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారా?చెప్పండి.కే టాక్స్‌ ఎల్‌ టాక్స్‌ చంద్రబాబుకు అలవాటు.ఇక్కడ ఏ టాక్స్‌ లేదు.ఒకటే టాక్స్‌ ప్రజలకు ఏది మేలో అది చేయడమే.
చిరంజీవి గారు సినిమా తీశారు సక్సెస్‌ అయింది.ఆయన కలుస్తున్నానని అన్నారు.సంతోషమే.
సినిమా ఇండస్ట్రీనుంచి ఎవరూ కలవలేరు అంటే దానికి వెనక ఏం ఉన్నాయే నాకు తెలియదు.నాగార్జున,మోహన్‌ బాబు వచ్చి కలిశారే.మీ ఉద్దేశ్యం ఏంటి బాలకృష్ణ వచ్చి కలవాలనా?
–వైయస్సార్‌ కాంగ్రెస్‌ వార్కి ఉద్యోగాలు ఇస్తున్నారని బిజేపి అంటున్నారు.నాలుగులక్షల ఉద్యోగాలు ఇచ్చాం.ఇది ప్రభుత్వ విధానం.రైతు భరోసా ఇస్తున్నాం కదా.
–అయ్యన్నపాత్రుడు సిఎం కుర్చీలో పిచ్చోడ్ని కూర్చోబెట్టారని అంటున్నారు.ఇలా అంటున్నందుకే అందుకే ప్రజలు వారిని అక్కడ కూర్చోబెట్టారు.విశాఖల్యాండ్‌ స్కామ్‌ కు ఎవరు సాక్షి అయ్యన్నపాత్రుడు కాదా.ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు.
నాలుగునెలల కాలంలో ఏ ఎంఎల్‌ ఏ కార్యకర్తపైనా అయినా దోపిడీ చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయా?ఇంకా టిడిపి నేతలే అలా చేస్తున్నారు.
–అలవాటు పడిపోయిన తిమింగలాలను ఎలా పట్టుకోవాలా అనే ఆలోచిస్తున్నాం.
–రాజధానిపై ఏం నిర్ణయం తీసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ....
నిపుణులకమిటీని వేశాం. ఏదైతే శివరామకృష్ణన్‌ కమిటీ ని వేసినప్పుడు వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా,నిపుణుల అభిప్రాయాలు తీసుకోకుండా నారాయణ అనే వ్యక్తితో కమిటీ వేసి ఓ ప్రాంతానికో ఓ సామాజిక వర్గానికో మేలు జరిగేలా చేసిన ఏర్పాటును చేసినదానిని అందరూ కూడా ఆక్షేపించారు. 
వరల్డ్‌ క్లాస్‌ అంటున్నారు. అది గ్రాఫిక్స్‌ లో తప్ప వాస్తవంలో కనిపించడం లేదు.ఈ ప్రభుత్వం గ్రాఫిక్స్‌ కోసం లేదు.వాస్తవికతో ఉంది..రాష్ట్రం ఆదాయ,ఆర్దికపరిస్దితిని దృష్టిలో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని 13 జిల్లాలు అబివృద్ది చెందేటట్లు ఐదు కోట్ల మంది అభివృధ్దికి ఆలోచన చేస్తూ నిపుణుల కమిటీ వేశాం.వారు నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై నిర్ణయం ఉంటుంది.